చిగురుమామిడి, అక్టోబర్ 21: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను అందరు సద్విని యోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దీపావళి పర్వ దినం పురస్కరించుకొని మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సోమవారం ప్రయాణికులతో ముచ్చటించారు. బస్సులు సమయానికి వస్తున్నాయా? అని ప్రయాణికుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.
ప్రజా పాలనపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారందరూ తొందరగా పూర్తి చేసుకోవాలని, వారికి వెనువెంటనే బిల్లులు మంజూరు అవుతున్నాయని అన్నారు. బస్టాండ్ వద్ద ప్రయాణికులతో కరచాలనం చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట కాంగ్రెస్ జిల్లా నాయకులు చిట్టిమల్ల రవీందర్ తదితరులు ఉన్నారు.