చిగురుమామిడి, జనవరి 6: తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
నియోజకవర్గ ప్రజలకు అనారోగ్య సమస్యలు ఉంటే మెరుగైన చికిత్స అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. తోటపల్లి రిజర్వాయర్లో భాగంగా ఓగులాపూర్లో సేకరించిన భూములను ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు తిరిగి ఇప్పిస్తామని చెప్పారు. అనంతరం లంబాడీపల్లెలో జీపీ భవనాన్ని ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ప్రారంభించారు. టీఎస్ పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను మంత్రి ఆవిషరించారు.
కార్యక్రమాల్లో లంబాడీపల్లె సర్పంచ్ నాగెల్లి వకులాదేవి, ఉపసర్పంచ్ ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, వైస్ ఎంపీపీ భేతి రాజిరెడ్డి, ఎంపీడీవో నర్సయ్య, తహసీల్దార్ ఇప్ప నరేందర్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి చిట్టిమల్ల రవీందర్, జిల్లా అధికార ప్రతినిధులు దాసరి ప్రవీణ్ కుమార్, ఐరెడ్డి సత్యనారాయణరెడ్డి, సుందరగిరి సర్పంచ్ శ్రీమూర్తి రమేశ్, మండల మహిళా అధ్యక్షురాలు ఓరుగంటి భారతీదేవి, జిల్లా మహిళా నాయకులు బుర్ర శివ లీల, పచ్చిమట్ల లక్ష్మి, బోయిని సురేశ్, నరేశ్, పోలు స్వప్న, అందె సురేశ్, పూల లచ్చిరెడ్డి, పోటు మల్లారెడ్డి, బుర్ర శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు, డీఈ రవి ప్రసాద్, ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.