Minister Ponnam | చిగురుమామిడి, మే 8: మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కొండపర్తి రాజకుమార్, ఆలయ జూనియర్ అసిస్టెంట్ బూట్ల కవిత, ఆలయ అర్చకులు శేషం సుధీరా చార్యులు, శేషం నరసింహచార్యులు పూర్ణకుంభంతో ఆలయంలో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తున్నానని, అన్ని సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి అన్నారు. అనంతరం ఆలయం ఎదుట కార్యకర్తలు కేక్ కట్ చేయించారు. స్వీట్లు పంపిణీ చేశారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత సైన్యం ఊరుకునే ప్రసక్తి లేదని, దేశాన్ని కాపాడుకునేందుకు సరిహద్దులో రక్షణగా ఉన్న సైనికులు విరోచితంగా పోరాడుతున్నారని అన్నారు.
రాజకీయాలకు అతీతంగా దేశానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని మంత్రి కోరారు. ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డిఓ మహేశ్వర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, తాసిల్దార్ ముద్దసాని రమేష్, ఆలయ చైర్మన్ సొల్లేటి శంకరయ్య, అర్చకులు శేషం నరసింహాచార్యులు, శేషం సుధీరా చార్యులు, నాయకులు బోలిశెట్టి శివయ్య, గీకురు రవీందర్, చిట్టిమల రవీందర్, చిట్టిమల్ల శ్రీనివాస్, గుర్రం మురళి గౌడ్, కాటం సంపత్ రెడ్డి, పోటు మల్లారెడ్డి, ఎనగందుల లక్ష్మణ్, ఓరుగంటి భారతీదేవి, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, పోలు స్వప్న, బోయిన వేణు, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.