Minister Ponnam | చిగురుమామిడి, మే 16 : తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం మంత్రి పొన్నం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుందరగిరి ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. దేవాలయానికి కమిటీ హాల్ ఏర్పాటు చేసేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.
కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతి పుష్కరాలు ఉమ్మడి జిల్లాలోనే ఉండడం మన గర్వకారణమని చెప్పారు. ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగేలా భగవంతుడి ఆశీర్వాదం ఉండేలా కోరుకోవడం జరిగిందన్నారు. సుందరగిరి ఆలయ గుట్టపైకి రహదారి ఏర్పాటు చేస్తామని, దేవాలయంలో వర్షానికి భక్తులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని అన్నారు. అనంతరం బ్రహ్మోత్సవాలు భాగంగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
రథోత్సవంలో గ్రామస్తులు కలిసి మంత్రి పొన్నం పాల్గొన్నారు. మంత్రి వెంట సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, మాజీ సర్పంచ్ శ్రీ మూర్తి రమేష్, మాజీ ఎంపీటీసీ ఓరుగంటి భారతీదేవి, ఆలయ ఈవో రాజ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ బూట్ల కవిత, పాలకవర్గ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.