రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. రాజీవ్‌నగర్ శివారులోని మినీస్టేడియంలో ఉదయం 11 గంటలకు పోలీస్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరు కానున్నారు.
అనంతరం మహిళల సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన యాప్‌తోపాటు మానసిక ఆరోగ్య సేవల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించనున్నారు. మంత్రి రాక నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
-రాజన్న సిరిసిల్ల, మే 1 (నమస్తే తెలంగాణ)