ఫర్టిలైజర్‌సిటీ, మే 1: రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనాన్ని ఈ నెల 8న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. సీపీ రెమో రాజేశ్వరితో కలిసి కోలేటి సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీ ల గదులు, కాన్ఫరెన్స్ హాల్, కంట్రోల్, సమావేశ గదులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రామగుండం కమిషనరేట్‌ను 28 ఎకరాల్లో 38.50కోట్లతో ఆధునిక హంగులతో నిర్మించామన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కమిషనరేట్ భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు సీఎం మొదటి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.
కమిషనరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి కేటీఆర్‌తోపాటు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ హాజరు కానున్నట్లు తెలిపారు. ఇక్కడ పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు వైభవ్ గైక్వాడ్, సుధీర్ కేకన్, ఏఆర్ అడిషనల్ డీసీపీ రియాజ్, ఏసీపీ ఏడ్ల మహేశ్, ఏఆర్ ఏసీపీ సుందర్రావు, గోదావరిఖని వన్‌టౌన్ సీఐలు ప్రమోద్‌రావు, ప్రసాద్‌రావు, టూటౌన్ సీఐ వేణుగోపాల్, రామగుండం సీఐ చంద్రశేఖర్, ఆర్ఐలు మధూకర్, శ్రీధర్, విష్ణుప్రసాద్, సీసీ మనోజ్‌కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఏ ఈ సాయి చంద్, వినయ్, డీఈఈ విశ్వనాథం, ఈఈ శ్రీనివాస్, ఎస్ఈ తులసీదర్ ఉన్నారు.