రాజన్నసిరిసిల్ల, మార్చి 5(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూం, సరస్వతీ విగ్రహ షెడ్డు, సోలార్ ప్లానెట్, 11:30 గంటలకు రూ.14ల క్షలతో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్, 12 గంటలకు రూ.20 లక్షలతో నిర్మించిన మల్లాపూర్ పంచాయతీ భవనం, 12:30 గంటలకు దేశాయిపల్లిలో రూ.33 లక్షలతో నిర్మించిన కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణం, రూ.14 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభిస్తారు. రూ.8.25లక్షలతో ప్రహరీ, టాయిలెట్స్, కిచెన్ షెడ్, డ్రింకింగ్ సంపు నిర్మాణం పూర్తి చేసి ప్రాథమిక పాఠశాలను ప్రారంభిస్తారు.
అనంతరం రూ.20 లక్షలతో చేపట్టనున్న దేశాయిపల్లి గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సిరిసిల్ల పట్టణంలోని షాదీఖానను ప్రారంభించనున్నారు. 1.30 గంటలకు రగు డు జంక్షన్ సుందరీకరణ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చే సి, కలెక్టరేట్లో చైల్డ్ కేరింగ్ సెంటర్ను ప్రారంభిస్తా రు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిసిల్ల ప్రె స్ క్లబ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకానున్నారు.