మంథని, జూలై 15 : ట్విట్టర్ వేదికగా నియోజకవర్గ కేంద్రమైన మంథనిలో జరిగిన అభివృద్ధిపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి ప్రశంసలు కురిపించారు. మంథనిలో జరిగిన అభివృద్ధిని వీడియో రూపంలో అధికారిక ట్విట్టర్ ఖాతాలో శనివారం పోస్టు చేశారు. తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో మంథని మున్సిపల్లో జరిగిన అభివృ ద్ధి వీడియోతో పాటు “మంథనిలో ప్రగతి పుం తలు.. పుణ్య స్థలికి పులకరింతలు..! అభయమి చ్చే ఆసుపత్రులు.. రూపుమారిన విద్యానిలయా లు, పేదలకు ఆత్మ గౌరవ గృహాలు.. ఉల్లాసాన్ని చ్చే ఉద్యానవనాలు.. బొక్కల వాగుపై చక్కని వా రధులు.. ఆటల కోసం క్రీడా ప్రాంగణాలు, పక్కా గా రోడ్లు.. ఓపెన్ జిమ్‌లు..! మారి పోయింది మంథని పురం.. గోదావరి ఒడ్డున ప్రగతి పరవ శం..!” అంటూ కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. మంథనిలో జరిగిన అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ పోస్టు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు : చైర్పర్సన్ శైలజ
మంథనిలో జరిగిన అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ పోస్టు చేసి అభినందనలు తెలియజేయడంపై ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం రాక మంథని ప్రాంతం అభివృద్ధికి అమడ దూరంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభు త్వం ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సహకారంతో మంథని ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్ మంథని అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు విడుదల చేయగా, వాటితో మంథని మున్సిపల్లోని అన్ని వార్డులను మరింత అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. మంథనిలో సీసీ రోడ్ల, డ్రైనేజీలు, తాగు, సాగునీరు, డబుల్ బెడ్ రూం ఇండ్ల లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మంథని అభివృద్ధికి సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌కు నియోజకవర్గ ప్రజల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.