“దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు. ఆయన నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు పలు పథకాలతో మేలు జరుగుతున్నది. వారి సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. మనసున్న సీఎం కేసీఆర్ ఇటీవలే దివ్యాంగులకు రూ.వెయ్యి అదనంగా పింఛన్ పెంచారు. దివ్యాంగులు మా హృదయంలో ఉన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి తొమ్మిదేళ్లలో ప్రభుత్వం రూ.10,310 కోట్లు వెచ్చించింది. మిజోరాం రాష్ట్రంలో ప్రతి నెలా రూ.100, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలైన చత్తీస్‌ఘడ్‌లో నెలకు రూ.200, కర్ణాటకలో రూ.1100, మధ్యప్రదేశ్‌లో రూ.300 కమ్యూనిస్ట్ పాలనలో ఉన్న కేరళలో రూ.1300, బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో రూ.300 ఇస్తుండగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు ఇస్తున్నరు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో రూ.3016 అందిస్తున్నాం.
ఇటీవలే సీఎం కేసీఆర్ మరో వెయ్యి పింఛన్ పెంచారు. ఇలాంటి పథకాలు అందించాలంటే మనసున్న సీఎం కేసీఆర్ లాంటి నాయకులు కావాలి. పింఛన్లు అందిస్తుంటే ఉచితాలకు అలవాటు చేస్తున్నారని బీజేపీ నిందలు వేస్తున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ కంపెనీలకు రూ.12.50 లక్షల కోట్లు మాఫీ చేస్తున్నది. ఇది తప్పు కాదా?. దివ్యాంగులకు ఆర్థిక పునరావాస పథకం దే శంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ రేటును రూ.30 వేల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. దివ్యాంగుల ఫ్రీ మెట్రిక్ ఉపకార వే తనం పథకంలో 1 నుంచి 10వ తరగతి దివ్యాంగులకు, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనం పథకంలో ఇంటర్ ఆపై చదువులు చదివే దివ్యాంగులకు ఉపకార వేతనాలు మంజూరు చేస్తున్నాం. వివాహ ప్రోతాహ్సక బహుమతి రూ. 50 వేల నుంచి రూ.లక్షకు పెంచాం. దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఇప్పటి వరకు రూ.10.50 కోట్లు కేటాయించాం. వారికోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 155326 ఏర్పాటు చేశాం. విద్య, ఉపాధి అవకాశాల్లో మూడు శాతం రిజర్వేషన్‌ను నాలుగు శాతానికి పెంచాం. డబుల్బెడ్రూం ఇండ్ల కేటాయింపులో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్‌ను ప్రకటించింది. ఇండ్ల కేటాయింపులో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తున్నాం. అర్హులైన దివ్యాంగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నాం.
– మంత్రి కేటీఆర్