“అధునాతన భవనాలు.. అత్యాధునిక వసతులతో జిల్లెల్ల వ్యవసాయ కళాశాల దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది.. విద్యార్థులు ఈ కళాశాలను సద్వినియోగం చేసుకొని, దేశానికే గర్వకారణంగా నిలిచే అగ్రానమిస్ట్లుగా తయారు కావాలి. ఉద్యోగాలు కల్పించేలా ఎదగాలి. తెలంగాణ వ్యవసాయం విధానం దేశానికే దిశ, దశ చూపుతున్నది” అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో 69.50 కోట్లతో నిర్మించిన వ్యవసాయ కళాశాల భవనాల సముదాయాన్ని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్‌తో కలిసి ప్రారంభించారు. అంతకుముందు జిల్లెల్లలోని కోల్డ్ స్టోరేజ్‌ను ప్రారంభించారు. వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో జరిగిన సభకు మంత్రి కేటీఆర్ అధ్యక్షత వహించి, ప్రసంగించారు.
సిరిసిల్ల రూరల్/ సిరిసిల్ల టౌన్/ తెలంగాణ చౌక్, ఏప్రిల్ 12 : జిల్లెల్లలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల అత్యాధునిక సౌకర్యాలతో దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని మంత్రి కేటీఆర్ స్ప ష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ విస్తరణ జరిగిందని తెలిపారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో నిర్మించిన వ్యవసాయ కళాశాల భవనాల సముదాయాన్ని శాసన సభాప తి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మరో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంత రం జరిగిన సభలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి నీళ్లు రాలేవని ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారని, ఎందుకు వారు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. హెలీకాప్టర్‌లో వచ్చే క్రమంలో వరుసగా కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, మన జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, ఎస్ఆర్ఆర్ ప్రాజెక్టు, మల్కపేట రి జర్వాయర్ను వీక్షించామని, ఇక్కడి నీళ్లను చూస్తే సంతోషమనిపించిందన్నారు. సమైక్య రాష్ట్రంలో జిల్లాలో ఒక్క రిజర్వాయర్ కూడా లేదన్నారు. ఈ రిజర్వాయర్లు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ అంటేనే ‘కాలువలు-చెరువులు-రిజర్వాయర్లు’ అని, రైతుబంధు వు అని కొనియాడారు. వ్యవసాయం దండుగ అన్న చోటే పండుగలా మార్చిన ఘనత ముఖ్యమంత్రికే ద క్కిందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు ఇవన్నీ కనబడడం లేదా? లేక కల్లుండీ చూడలేని కబోదు లా? అని ఎద్దేవా చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే పాలిటెక్నిక్ కళాశాలతోపాటు వ్యవసాయ కళాశాలను మంజూరు చేసుకున్నామని, విద్యార్థులు ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి శాటిలైట్ క్యాంపస్, జిల్లెల్ల వ్యవసాయ కళాశాలను పీజీ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కోరారు. అదేవిధంగా మంత్రి నిరంజన్‌రెడ్డి తన ప్రసంగంలో జగ్జీవన్‌రావ్ గురించి ప్రస్తావించా రని, వ్యవసాయ విప్లవానికి నాంది పలికిన జగ్జీవన్‌రావ్ పేరునే కళాశాలకు పెడతామని ప్రతిపాదించారు. అంతేకాకుండా కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, పరిశ్రమల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గ్యా దరి బాలమల్లు, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీ ణ్, గిడ్డంగుల సంస్థల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వైస్ చైర్మన్ సిద్ధం వేణు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, వ్యవసాయశాఖ రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌బాబు, ప్రవీణ్‌రావు, కలెక్టర్ అనురాగ్‌జయంతి, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, ఉచ్చిడి మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లెల్ల సర్పంచ్ మాట్ల మధు, తదితరులు పాల్గొన్నారు.
ఇరువై ఏండ్ల క్రితం కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడపకపోతే, రాష్ట్రం ఏర్పాటు కాకపోతే ఈ రోజు వ్యవసాయ కళాశాలలో సభ ఉండేది కాదు. ఇంత పెద్ద వ్యవసాయ కాలేజీని ఈ మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే అవకాశం లేకపోవు. ఒకప్పుడు ఈ ప్రాం తంలో సాంఘిక సమస్యలు, అలజడులు ఉండేవి. కానీ, నేడు ఈ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. ఇవాళ వ్యవసాయ కళాశాలను జిల్లెల్లలో ఏర్పాటు చేసుకున్నాం. ఇంతమంది ప్రముఖులు ఇక్కడి వచ్చారు. అమెరికా తరహాలో మౌలిక వసతులతో కూడిన కాలేజీని ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో వ్యవసాయం పరిశ్రమగా మారబోతున్నది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఆలోచన కల్పించిన ప్రొఫెసర్ జయశంకర్‌సార్ పేరు ఈ వ్యవసాయ కళాశాలకు పెట్టుకోవడం వెనుక మన ప్రాంతం అభివృద్ధి జరుగాలన్న ఆలోచన చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్. రానున్న రోజుల్లో విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగ సమస్యలపై అధ్యయనం చేయాలి. నూతన ఒరవడులు ఆలోచన చేసి సమస్యలకు మార్గదర్శనం చేయాలి.
– బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
జిల్లెల్ల వ్యవసాయ కళాశాల కర్త, కర్మ, క్రియ మంత్రి కేటీఆర్. నా 47 ఏండ్ల రాజకీయం జీవితంలో అనేక మంది రాజకీయ నాయకులు, మంత్రులను చూశా. కానీ, కేటీఆర్ లాంటి నాయకుడిని చూడలేదు. 1972 ప్రాంతంలో సిరిసిల్లలో పశువులకు ఎండుగడ్డి దొరకని పరిస్థితి ఉండేది. ఆ సమయంలో నా వ్యవసాయ పొలంలోని గడ్డిని ఇక్కడికి తెచ్చి విక్రయించినా. అలాంటి పరిస్థితుల నుం చి తెలంగాణ వచ్చినంక పచ్చదనంతో కళకళలాడుతున్నది. కేసీఆర్ సీఎంగా ఉండ డం, సిరిసిల్లకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహించడంతోనే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి సాధించింది. చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వలసలకు నిలయంగా ఉండే సిరిసిల్ల నేడు పూర్తిగా మారింది. రోడ్లు, భవనాలు, రహదారులు, కళాశాలలతో అన్ని విధాలా అభివృద్ధి చెందింది. నేనే ఇక్కడి ఓటరునైతే సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్‌ను ఏకగ్రీవంగా ప్రతిపాదించేవాన్ని. ఇంతకంటే మంచి నాయకుడు దొరకడం కష్టం. ఇంత కమిట్మెంట్తో పని చేసే వ్యక్తులు ఉండడం సిరిసిల్ల ప్రజల అదృష్టం. ఒకప్పుడు భూగర్భజలాలు లేని సిరిసిల్ల ఇప్పుడు ఆరు మీటర్లు పెరిగి నంబర్‌వన్‌గా నిలిచింది. ఐఏఎస్ అధికారులకు ఇక్కడి భూగర్భజలాల పెరుగుదల అంశం పాఠ్యాంశంగా మారింది. దేశంలో రెండే రంగాలు ఉపాధి కల్పించేవి. అందులో ఒకటి వ్యవసాయం, మరొకటి పరిశ్రమల రంగం. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి అయ్యాక పది లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. రాష్ర్టానికి అనేక రకాల పరిశ్రమలు వచ్చాయి. అందులో 19 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వచ్చాయంటే ఇదంతా కేటీఆర్ సమర్థతతోనే సాధ్యమైంది. తక్కువ సమయంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఉపాధి కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది.
– పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్
జిల్లెల్ల ఏ ఇంట్లో చూసినా ప్రభుత్వ సంక్షేమం, ఏ ఊళ్లో చూసినా పచ్చదనం కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి ప్రాజెక్టులు కట్టి భావితరాలకు నీటిమూట సంపదను అందించారు. ఉబికి వచ్చిన భూగర్భజలాల్లో సిరిసిల్ల జిల్లా నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతంలో 40 వేల ఎకరాల్లో పంటలు పండితే గొప్పగా చెప్పుకునేది. పెరిగిన భూగర్భ జలాలు, ప్రాజెక్టులతో ఇప్పుడు లక్షా 70 వేల ఎకరాలకు పంటసాగు పెరిగింది. ఇదంతా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తోనే సాధ్యమైంది. ఒకప్పుడు సిరిసిల్ల-వేములవాడల మధ్య ఒక్క డిగ్రీ కళాశాల మాత్రమే ఉండేది. ఇప్పుడు మెడికల్, నర్సింగ్, జేఎన్టీయూ, వ్యవసాయ కళాశాల వంటి అనేక విద్యాలయాలు వచ్చాయి. ఆధునిక వసతులు, సాంకేతికతతో జిల్లెల్లలో వ్యవసాయ కాలేజీ రావడం విద్యార్థులు చేసుకున్న అదృష్టం. మంత్రి కేటీఆర్ కోరిన విధంగానే సీఎం కేసీఆర్ ఆమోదంతో పీజీ వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తా. వచ్చే విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభిస్తా. నాడు హైదరాబాద్ కాలేజీ గోడలపై సిరిసిల్లలో జరుగుతున్న పోరాటాల గురించి రాతలు ఉండేవి. ఇక్కడ జరుగుతున్న ఎన్కౌంటర్లు, పోరాటాలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు దేశంలోనే సంచలనాత్మకమయ్యేవి. ప్రస్తుతం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఈ పరిస్థితులు పూర్తిగా మారాయి. కేటీఆర్ నేటి తరానికి మార్గదర్శకుడు, రేపటి తరానికి నాయకత్వం వహించే దక్షతగల నాయకుడు. ఆధునిక వసతులు, సాంకేతికతతో వ్యవసాయ కాలేజీ రావడం విద్యార్థులు చేసుకున్న అదృష్టం.
– సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న మంత్రి కేటీఆర్‌కు అభినందనలు. రాష్ట్రం వచ్చాక వ్యవసాయ రంగంలో మార్పులు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఇటువంటి కళాశాల ఏర్పాటు చేసుకుంటామని ఎప్పుడూ అనుకో లేదు. భూ పోరాటం నుంచి మొదలుకొని సాయుధ పోరాటాల వరకు అమరులైన వా రందరికి నివాళి చి హ్నంగా ఈ కళాశాల మారింది. మెట్టగా ఉన్న ఈ ప్రాంతం ముఖచిత్రం మారిందని భావిస్తున్నా. విద్యార్థులకు పరిశోధనల సమయంలో సవాళ్లు వస్తాయి. ఆహార భద్రతే కాదు పౌష్టికాహార భద్రత పరిశోధన జరుగాలి. వడగండ్ల వానలను ఎదుర్కోవడానికి అవసరమైన పరిశోధనలు చేయాలి. భూసారాన్ని రక్షించుకోవాలి. సహకార రంగ వ్యవస్థలో కరీంనగర్ డెయిరీ, సెస్, ముల్కనూర్ వాటన్నంటినీ ఒకే వేదిక వద్దకే చేర్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
– చెన్నమనేని రమేశ్‌బాబు, వేములవాడ ఎమ్మెల్యే