నమస్తే నెట్వర్క్, మార్చి 13 : భారత జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కవిత బర్త్‌డే వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు కేకులు కోసి, స్వీట్లు పంచాయి. పలు ఆలయాల్లో పూజలు చేసి, నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కేక్ కట్ చేయగా, నాయకులు స్వీట్లు పంచిపెట్టారు. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణుల సమక్షంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
శంకరపట్నం మండల కేంద్రంతో పాటు ఎరడపల్లిలో రాష్ట్ర సాంస్కతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి పెట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్పర్సన్ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంథనిలోని రాజగృహలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితకు పూల మొక్క అందజేసి, శాలువాతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.