కార్పొరేషన్, ఏప్రిల్ 9: కరీంనగర్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని 14, 59వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి భూమిపూజ చేశారు. 59వ డివిజన్లో రూ.10 లక్షలతో చేపట్టే వేంకటేశ్వర ఆలయ తోరణం, 14వ డివిజన్లో రూ.19 లక్షలతో సీసీ రోడ్డు పనులు, రూ.10లక్షలతో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు, ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.
ప్రజలు శభాష్ అనేవిధంగా పని చేస్తున్నామని తెలిపారు. సీఎం సహకారంతో రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ పూర్తయితే గొప్ప పర్యాటక కేంద్రంగా కరీంనగర్ నిలుస్తుందన్నారు. రెడ్డి సంఘ భవనానికి ఇప్పటికే రూ.10లక్షలు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. గౌడ, కాపు, మహిళా, రజక సంఘాలకు స్థలం కేటాయింపుతోపాటుగా రూ.10లక్షల చొప్పున నిధులు కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, రాజేందర్ రావు, గందే మాధవి, బోనాల శ్రీకాంత్, ఐలందర్యాదవ్, రెడ్డి సంక్షేమ సంఘం శ్రీనగర్ సప్తగిరి కాలనీ అధ్యక్షుడు చెన్నాడి రాజేశ్వర్‌రెడ్డి, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, గడ్డం జగత్పాల్రెడ్డి, గడ్డం ప్రశాంత్‌రెడ్డి, కోట భాసర్‌రెడ్డి, పోరెడ్డి శ్రీహరిరెడ్డి, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న గంగుల, వినోద్
కరీంనగర్‌లోని మధుగార్డెన్‌లో ముస్లింలకు ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విం దులో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి, మా ట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను ఆనందోత్సవాల మధ్య జరుపుకొనే విధం గా చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ముస్లిం ల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమం లో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్ షమీ, ఎంఐఎం నాయకుడు గులాం అహ్మద్, నాయకులు షవొద్దీన్, అమ్జద్, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.
అండర్ టన్నెల్ ఆక్వా ఎగ్జిబిషన్ ప్రారంభం
విద్యానగర్, ఏప్రిల్ 9: తెలంగాణ మొట్టమొదటి సారిగా కరీంనగర్‌లోని పద్మనగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అండ ర్ టన్నెల్ ఆక్వా ఎగ్జిబిషన్‌ను ఆదివారం రాత్రి బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించి, నిర్వాహకులను అభినందించారు. ఇక్కడ ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మేయర్ వై సునీల్‌రావు, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, దిండిగాల మహేశ్, నాయకులు కర్ర సూర్యశేఖర్, నిర్వహకులు రాజిరెడ్డి, మహ్మద్ ఇతియాస్, మహ్మద్ అలీ, మహ్మద్ సమీర్, తదితరులు పాల్గొన్నారు.