కరీంనగర్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నాడు ఉద్యమాల ద్వారా స్వరాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అభివృద్ధిలోనూ తెలంగాణను దేశానికే రోల్ మాడల్‌గా నిలుపుతున్నారు. తెలంగాణలో ఓటడిగే హక్కు కేవలం బీఆర్ఎస్కు మాత్రమే ఉంది. సందర్భం ఏదైనా సరే కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు గుండెల్ల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం కరీం‘నగరం’లోని మీ సేవ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ప్రజల గుండెల్లో..
తెలంగాణలో పటిష్టమైన నాయకత్వాన్ని అలాగే, ప్రజల ఆశయ సాధన కోసం పనిచేసే పార్టీని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారని, ఈ అర్హతలు బీఆర్ఎస్కు తప్ప ఏ పార్టీకి లేవని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆది నుంచి నేటి వరకు ఒక క్రమ శిక్షణ గల పార్టీ బీఆర్ఎస్ అన్నారు. రాజకీయాలు కాదు అభివృద్ధే తమకు ముఖ్యమన్న కోణంలో ముఖ్యమంత్రి వెళ్తున్నారని, అందుకే అనేక రంగాల్లో నేడు దేశానికి తెలంగాణ రోల్‌మాడల్‌గా నిలిచిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో లేని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత ప్రప్రథమంగా ఈ నెల 25న నియోజవకర్గ స్థాయిలో ప్లీనరీలను ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగా కరీంనగర్ నియోజకవర్గ ప్లీనరీని ఉదయం 10గంటలకు నగరంలోని రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల సభ్యులు, అనుబంధ సంఘాలు, ముఖ్య కార్యకర్తలతో దాదాపు 3వేల మందికిపైగా కలిసి ప్రతినిధుల సభను నిర్వహించి రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు తీర్మానాలు చేస్తామని చెప్పారు. రేపు ఉదయం 8 గంటల నుంచే పండుగ వాతావరణంలో ఆయా గ్రామాల్లో, ప్రాంతాల్లో జెండాను ఎగురవేసి ఆ స్థానిక బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి రాజశ్రీ గార్డెన్ చేరుకుంటారని వెల్లడించారు.
కేంద్రం వివక్ష
జనాభాలో 56 శాతం ఉన్న బీసీలపై కేంద్రం వివక్ష చూపుతున్నదన్నారు. ప్లీనరీలో తెలంగాణ ప్రభుత్వం పేదలకు, సమాజానికి చేస్తున్న మం చితోపాటు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వల్ల సమాజానికి జరుగుతున్న చెడును సైతం వివరిస్తామన్నారు. ఆ దిశగా చేసే తీర్మానాల్లో చర్చిస్తామన్నా రు. కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అలాగే చట్ట సభలో రిజర్వేషన్ కల్పించాలని, దీంతోపాటుగా బీసీ కులగణన చేపట్టాలని తీర్మానం చేయనున్నట్లుగా వెల్లడించారు. బీసీ ప్రధాని అని చెప్పుకొనే బీజేపీ ప్ర ధాని ఇకనైనా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రి గంగుల డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేదర్ను ఘనంగా స్మరించుకొని 125 అడుగుల అంబేదర్ విగ్రహంతో పాటు, రాష్ట్ర సచివాలయానికి సైతం బాబాసాహెబ్ పేరు పెట్టిందన్న మంత్రి గంగుల, అదే స్ఫూర్తితో కేంద్రం సైతం నూతన పార్లమెంట్ భవనానికి అంబేదర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక్కడ జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, నగర శా ఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, గ్రంథాలయ చైర్మన్ పొ న్నం అనిల్, బీఆర్ఎస్ నేతలు వాసాల రమేశ్, శ్రీనివాస్, కుల్దీప్, రవివర్మ, నవీన్ ఉన్నారు.