కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 23 : బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిచేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగు ల కమలాకర్ తెలిపారు. మంగళవారం ఆయనతోపాటు జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్‌కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శిం చి, సంఘీభావం తెలిపారు.
సీఎం కేసీఆర్ ఇటీవలి కా లంలో ప్రధాని మోదీ, బీజేపీ వైఫల్యాలను బలంగా ఎండగడుతున్నందుకే మహిళ అని కూడా చూడకుండా ఎమ్మెల్సీ కవితపై కక్ష కట్టారని, ప్రణాళికాబద్ధంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు ఆసారం లేదని, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్యంపై, మహిళలపై గౌర వం లేకుండా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. సుస్థిర సంక్షే మపాలన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, నాయకత్వంపై అసత్య ఆరోపణలు, అభూత కల్పనలు చేస్తున్నారని ఆరోపించారు. మత రాజకీయాలు చేస్తూ ప్రజల్లో తీవ్రవిద్వేశాలు కలిగేలా చేస్తున్న కుట్రల్ని తెలంగాణ సమా జం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుందన్నారు. తెలంగాణ సమాజం యావత్తు ఎమ్మెల్సీ కవితకు సంఘీభావంగా ఉంటుందని స్పష్టం చేశారు.