Minister Adluri | ధర్మారం, సెప్టెంబర్17: ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో బుధవారం మండలంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండలంలోని విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కార్యక్రమానికి ముందు విశ్వకర్మ పథకాన్ని ఆవిష్కరించారు . అనంతరం మండపంపై విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపం ఎదుట హోమం నిర్వహించారు. విశ్వకర్మ జీవిత చరిత్ర గురించి పురోహితుడు శ్రీపెల్లి బ్రహ్మచార్యులు భక్తులకు వివరించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై పూజలు చేశారు. మంత్రిని ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమం అనంతరం విశ్వకర్మ విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం మండలాధ్యక్షుడు తాటికొండ వెంకటేష్, కోశాధికారి చింతల తిరుపతి, ఉత్సవ కమిటీ కమిటీ సభ్యుడు ఎలువాక బుచ్చయ్య, విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షుడు పాములపర్తి సత్యనారాయణ, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు మూటపల్లి తిరుపతి, గౌరవాధ్యక్షుడు ఎర్రోజు శ్రీనివాస్, సభ్యులు రాజమౌళి, వెంకటస్వామి, సత్తయ్య, రంగాచారి, దామోదర్, విశ్వకర్మ విగ్రహ దాత శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. కాగా శోభాయాత్ర అనంతరం విశ్వకర్మ విగ్రహాన్ని రాయపట్నం వద్ద గోదావరిలో నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.