Minister Adluri | మల్లాపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి అడ్లూరి
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని మంగళవారం రాష్ట్ర మంత్రి అడ్లూరిలక్ష్మణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Minister Adluri | ధర్మారం,జూన్ 30 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని మంగళవారం రాష్ట్ర మంత్రి అడ్లూరిలక్ష్మణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులకు అందుతున్న అల్పాహారం, భోజనం మెనూ అమలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కిచెన్, డైనింగ్ హాల్ తో పాటు స్టోర్ రూమ్ ను ఆయన పరిశీలించారు. మల్లాపూర్ గురుకుల పాఠశాలకు సరఫరా చేసిన సన్న బియ్యాన్ని మంత్రి పరిశీలించారు.
బియ్యంలో నూకల శాతం ఎక్కువ ఉన్నందున బియ్యాన్ని వెనక్కి తీసుకొని సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని పంపించాలని పెద్దపల్లి జిల్లా పౌరసరఫరాల అధికారికి మంత్రి ఫోన్లో మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురుకుల పాఠశాలలో 27 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య అందుతుందని, విద్యార్థులకు యూనిఫామ్స్ తో పాటు విద్యార్థులకు సంబంధించిన అన్ని రకాల వస్తువులను అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లువివరించారు. మంత్రి వెంట ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లనాయక్, నాయకులు తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళనాడు సీఎం విజయ్తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

