అన్నదాతను విస్మరిస్తే పుట్టగతులుండవు
అన్నదాతను విస్మరిస్తే పుట్టగతులు లేకుండా పోతారని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మండిపడ్డారు. వెల్దం డ మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో ప్రజల మద్దతు పొంది అధికారంలోకి వ చ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుం గలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- పథకాల అమలులో ప్రభుత్వం విఫలం
- కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
వెల్దండ, ఆగస్టు 3 : అన్నదాతను విస్మరిస్తే పుట్టగతులు లేకుండా పోతారని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మండిపడ్డారు. వెల్దం డ మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో ప్రజల మద్దతు పొంది అధికారంలోకి వ చ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుం గలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
రైతు రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. రైతుల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కం టే ప్రచారానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని ఆయన అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రామ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజితారెడ్డి, నాయకులు జంగిలి నిరంజన్, అనిల్‌కుమార్, దశరథం, అంజినాయక్, లింగం, ప్రసాద్, అంజిమాస్టర్, పలువురు నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

