పామూరుకు ఆర్టీసీ బస్సు రద్దు
మెట్పల్లి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన వలస కూలీలు భవన నిర్మాణ రంగాల్లో పని చేస్తుంటారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన వారంతా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి మెట్‌పల్లికి రాకపోకలు సాగిస్తుంటారు.
మెట్పల్లి, జనవరి10: మెట్పల్లి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన వలస కూలీలు భవన నిర్మాణ రంగాల్లో పని చేస్తుంటారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన వారంతా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి మెట్‌పల్లికి రాకపోకలు సాగిస్తుంటారు. వీరి కోసం పదిహేను ఏండ్ల నుంచి మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు (మెట్పల్లి-పామూరు) నడుస్తున్నది. ఈ బస్ సర్వీస్‌తో డిపోకు లాభమే తప్ప నష్టమే లేదు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడంతో పామూరు-మెట్పల్లి మధ్య నడిచే బస్సుకు బ్రేక్ పడింది. దీంతో వలస కార్మికులు ఇబ్బందిపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్టీసీ కరీంనగర్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ భూపతిరెడ్డిని వివరణ కోరగా, మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అంతర్గత బస్ సర్వీసులను పెంచడం కోసం మెట్పల్లి-పామూరు మార్గంలో నడిచే ఎక్స్‌ప్రెస్ బస్‌ను రద్దు చేసినట్లు వివరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

