Equal pay |పెద్దపల్లి టౌన్ జూన్ 9 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, జిల్లా అధ్యక్షులు పూసాల రమేష్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని, పెండింగ్ మెస్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు 23 ఏళ్లుగా 54 వేల మంది మహిళా కార్మికులు చాలీచాలని వేతనాలకు కష్టపడి పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మెస్ బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఆరోపించారు. పాఠశాలలు పున ప్రారంభమవుతున్న సందర్భంలో కోడిగుడ్ల బిల్లు మెస్ బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న వాటిని చెల్లింపు విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని, కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా మెస్ బిల్లులు కోడిగుడ్డు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఏఐటీయూసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.