Peddapally | పెద్దపల్లి, సెప్టెంబర్12 : మతిస్థిమితం లేని ఇద్దరు మహిళలను శుక్రవారం హైదరాబాద్ టుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రమానికి తరలించినట్లు జిల్లా సంక్షేమ శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత తెలిపారు.
పెద్దపల్లి, రామగుండం ప్రభుత్వ దవాఖానలో గత కొన్ని నెలలుగా మతిస్థిమితం లేని మహిళలున్నారని, వాళ్లు రోగులకు, వైద్య సిబ్బందికి ఇబ్బందులు కల్గిస్తున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్లు జిల్లా సంక్షేమాధికారికి సమాచారం అందించగా, కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలతో సదురు మహిళలను ఆశ్రమానికి తరలించినట్లు ఆమె తెలిపారు.