yoga | కోరుట్ల, జూన్ 21: యోగాభ్యాసంతో మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని పట్టణ జూనియర్ సివిల్ జడ్జి పావనీ అన్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ యోగా గురువు కస్తూరి రాజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన యోగభ్యాస కార్యక్రమంలో న్యాయమూర్తి పాల్గొన్నారు. ఈసందర్భంగా యోగా గురువు సమక్షంలో యోగ ఆసనాలు, ప్రాణాయమం, ధ్యానం చేశారు.
అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరికి యోగా, ధ్యానం ఎంతో అవసరమని చెప్పారు. యోగాభ్యాసం మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీ సుతారి నవీన్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు రాసభక్తుల రాజశేఖర్, ఏజీపీ గోనే రాజేష్ ఖన్నా, పలువురు సీనియర్, జూనియర్, న్యాయవాధులు పాల్గొన్నారు.