yoga | కాల్వశ్రీరాంపూర్. జూన్ 16 : యోగా చేయడం వల్ల మానసికంగా, ఆరోగ్యంగా ఉంటామని ఆయుష్ డాక్టర్ నిహారిక అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వాసుపత్రి ఆయుష్ డాక్టర్ నిహారిక బాల బాలికలకు సోమవారం యోగా తరగతులు నిర్వహించారు .
ఈ సందర్భంగా డాక్టర్ నిహారిక మాట్లాడుతూ ప్రతీరోజూ యోగా చేయడం వల్ల అనారోగ్యాలు దరిచేరకుండా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటామన్నారు. యోగా, నడకతో, మెడిటేషన్ తో విద్యార్థులలో ఏకాగ్రత పెరిగి చదువులో ఎంతో ముందుంటారు అన్నారు. ప్రతీ రోజు క్రమం తప్పకుండా పిల్లలతోపాటు పెద్దలు, మహిళలు యువతీ యువకులు యోగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సునీత, పీహెచ్ఎన్ భాగ్యలక్ష్మి, హెచ్ఈఓ శ్రీనివాస్, వినీత్, ఏఎన్ఎం సరోజన, ఆశలు మౌనిక, సరోజన, శారద తదితరులు పాల్గొన్నారు.