Medical Camp | చిగురుమామిడి, జనవరి 16 : చిగురుమామిడి మండలంలోని చిన్న ములుకలూరు గ్రామంలో గ్రామపంచాయతీ సర్పంచ్ సాంబారి భారతమ్మ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలు వైద్య శిబిరంలో పాల్గొని బీపీ, షుగర్, థైరాయిడ్ మొదలగు పరీక్షలు చేయించుకున్నారు.
అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని ప్రసన్న, సూపర్వైజర్ పద్మ, ఏఎన్ఎం మమత, మాలతి, ఉప సర్పంచ్ పైడిపల్లి వెంకటేష్, మాజీ ఎంపిటిసి సాంబారి కొమురయ్య, వార్డు సభ్యులు విజయలక్ష్మి, రాము, శ్రుపిత్, తిరుపతి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.