Indurthi | చిగురుమామిడి, జూలై 4 : చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో సీనియర్ ఐఏఎస్ పరికిపoడ్ల నరహరి ఆదేశాల మేరకు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీవీఎం హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వారి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 300 మందికి పైగా గ్రామస్తులు బీపీ, షుగర్ తో పాటు వివిధ రకాల టెస్టులను ఉచితంగా చేసుకొని మందులు తీసుకున్నారు. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాక్సిడెంట్ల కాళ్లు విరిగినవారికి కృత్రిమ కాళ్లు, కంటి పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతపూల నరేందర్, ఉప సర్పంచ్ చింతపూల అనిల్, కొండాపూర్ మాజీ సర్పంచ్ వంగర మల్లేశం, వార్డ్ సభ్యులు లావణ్య, లక్ష్మణ్ కుమార్, కిరణ్, లక్ష్మి, పూజ, తిరుపతి, విజయ్, అనిల్, పంచాయతీ కార్యదర్శి స్వర్ణలత, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదే రఘునాథ్ రెడ్డి, విష్ణు గౌరీ శంకర్ ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సీఈవో మిట్టపల్లి రాజేంద్ర కుమార్, ఉమేష్, రామంచ తిరుపతి, కోలుగూరి వెంకటేష్, సీవీఎం హాస్పిటల్ చైర్మన్ బాట్ల శ్రీధర్, ఎండీ ఫిజిషియన్ బాట్ల సునీత, సైకాలజిస్ట్ బచ్చు అనుదీప్, ఆర్థోపెటిక్ శ్రీధర్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.