Free Medical Camp | పెద్దపల్లి రూరల్ జనవరి 7 : పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేటలో బుధవారం కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 150 మందికి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, ఈసీజీ, కీళ్ల నొప్పులకు సంబంధించిన పరీక్షలు చేసి రోగనిర్ధారణ చేశారు.
ఈ సందర్భంగా మెడికవర్ దవాఖాన సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ హనుమంతుని పేట గ్రామ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో పండుగలు, సెలవులతో సంబంధం లేకుండా 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ శిబిరంలో గ్రామ సర్పంచ్ మ్యాడగోని శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ మేకల కుమార్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి అశోక్, వార్డు సభ్యులు, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, బొంగోని హరీష్, రమేష్ తదితులు పాల్గొన్నారు.