KAMANPOOR | రొంపకుంటలో వైద్య విద్యార్థుల దత్తత కార్యక్రమం..రొంపికుంటను సందర్శించిన వైద్య కళాశాల విద్యార్థులు
రామగుండం సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వ వైద్య కళాశాల 2025 మొదటి సంవత్సర బ్యాచ్ వైద్య విద్యార్థులు 150 మంది, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరేందర్ ఆదేశానుసారం కుటుంబ దత్తత కార్యక్రమం ( ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాం) కమాన్ పూర్ మండలంలోని రొంపికుంట గ్రామంలో రెండో సారి చేపట్టారు.
KAMANPOOR | కమాన్ పూర్, మార్చి 7 : రామగుండం సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వ వైద్య కళాశాల 2025 మొదటి సంవత్సర బ్యాచ్ వైద్య విద్యార్థులు 150 మంది, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరేందర్ ఆదేశానుసారం కుటుంబ దత్తత కార్యక్రమం ( ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాం) కమాన్ పూర్ మండలంలోని రొంపికుంట గ్రామంలో రెండో సారి చేపట్టారు. క్షేత్ర స్థాయి పర్యటనలో బాగంగా ఆరోగ్య ఉప కేంద్రంలోని గ్రామ కుటుంబాలను సందర్శించారు. వైద్య విద్యార్తలు తాము దత్తత తీసుకున్న కుటుంబాలను సందర్శించి వారి ఆరోగ్య సమాచారం, కుటుంబ ఆర్థిక స్తితిగతులు ఇంటి పరిసరాల పరిశుభ్రత గురించిన సమాచారాన్ని సేకరించారు.
వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి వివరించి ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సర్వే కార్యక్రమాన్ని సర్పంచ్ గుమ్మడి శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి జానకి పర్యవేక్షించారు. వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిషన్ డిప్యుటీ.ఇన్చార్జి డాక్టర్ అఖిల్ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేష్, పీ రవీందర్, టీ నాగరాజు, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సల్మా, సబ్సెంటర్ ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

