సారంగాపూర్, జూన్ 5 : వైద్య సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. సారంగాపూర్ మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి లో ఓపీ సేవలు, ఐపీ సేవలు, రికార్డ్స్, ల్యాబ్ రికార్డ్స్, ఐపీ రికార్డ్స్ పరిశీలించి మెడికల్ ఫార్మసి మందులు పరిశీలన చేసిన వివరాలు తెల్సుకున్నారు.
ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య సేవలు మెరుగు పరచాలని డాక్టర్లు, సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదే శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముందస్తు వర్షాకాలం డెంగ్యూ వైరల్ ఫీవర్లకు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్ ఉండకుండా చూసుకోవాలి డాక్టర్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోని ఉన్న పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, మాత శిశు సంరక్షణ అధికారి ముస్కు జైపాల్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.