E-pharmacy policy | ఈ ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 20న మెడికల్ షాపుల బంద్.. తెలంగాణ కెమిస్ట్, డ్రగ్జిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్
రోగులకు అవసరమైన ఔషధాలను విక్రయించే విధానంలో ఈ ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
E-pharmacy policy | రాజన్నసిరిసిల్ల,మే15( నమస్తే తెలంగాణ) : రోగులకు అవసరమైన ఔషధాలను విక్రయించే విధానంలో ఈ ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ ఫార్మసీ రద్దు చేయాలని నిరసనగా ఈ నెల 20 న దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ లను ఒక రోజు బంద్ కు పిలుపు నిచ్చారు. తెలంగాణ కెమిస్ట్రీ అండ్ డ్రగ్జిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం ఆధ్వర్యంలో బంద్ కరపత్రాన్ని శనివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫార్మా రంగాన్ని ప్రభావితం చేస్తున్న పలు సమస్యలపై ఇప్పటికే విజ్ఞప్తులు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
ఈ ఫార్మసీ విక్రయాల ద్వారా ప్రజా ఆరోగ్యానికి ముప్పు ఉందని అన్నారు. ఆధునిక సాంకేతికతను అడ్డుపెట్టుకొని నకిలీ ప్రిస్క్రిప్షన్ ల ద్వారా ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఉందని హెచ్చరించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరిన స్పందించడం లేదని ఆరోపించారు. కోవిడ్ కాలంలో జారీ చేసిన తాత్కాలిక నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవడమే కాకుండా, దేశంలో ఈ ఫార్మసీ విధానాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటుల అనైతిక డిస్కౌంట్ లను అరికట్టేందుకు నూతన విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మందుల దుకాణాల యజమానుల సమస్యలపై ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ లను బంద్ చేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి టీ రాజు, ట్రెజరర్ పీ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

