Meat shops | కోల్ సిటీ, సెప్టెంబర్ 3 : డీఎంఏ ఆదేశాల మేరకు రామగుండం నగర పాలక సంస్థ గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పవిత్ర పర్వదినం శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, రామగుండం, ఎన్టీపీసీ తదితర ప్రాంతాల్లో మాంసం దుకాణాలు మూసివేసి ఉంచాలని నగర పాలక కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశించింది. ఈ మేరకు గురువారం ప్రకటన జారీ చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా వ్యాపారులు జీవ హింసకు పాల్పడి గుట్టుగా మాంసం విక్రయించినట్లయితే సదరు వ్యాపారుల లైసెన్సులను రద్దు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.