Talent Test | పాలకుర్తి: పాలకుర్తి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ పాలకుర్తి ఎంఆర్సీలో శనివారం నిర్వహించారు. ఈ పరీక్షకు మండలంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలల నుండి ఆరు నుండి పదో తరగతి వరకు 40 మంది విద్యార్థులు హాజరయ్యారు. పోటీ పరీక్షలో పాల్గొన్న విద్యార్థుల నుండి ప్రాథమికోన్నత స్థాయిలో ఐదుగురు, సెకండరీ స్థాయిలో ఐదుగురు, విద్యార్థులను జిల్లా స్థాయిలో జరిగే టాలెంట్ టెస్ట్ కు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇందులో టీ సాయివర్షిత (కన్నాల), ఎండీ కపిల్ (ఇశాల తక్కల్లపల్లి), డీ అనుష (జయ్యరాం), హెచ్ ఇందుమతి (కుక్కలగూడూరు), బీ అక్షయ (కేజీబీవీ పాలకుర్తి) ఎంపికయ్యారు. ప్రాథమిక స్థాయిలో కే విగ్నేష్ (కుక్కలగూడూర్), మనుదీప్ (కుక్కలగూడూర్), ఏ శివ చైతన్య (జయ్యారం), కే భవానీ (బసంతనగర్), డీ నిథ్యా (కేజీబీవీ పాలకుర్తి) ఎంపికయ్యారు. జిల్లాస్థాయిలో జరిగే గణిత, సైన్స్ టాలెంట్ టెస్ట్ కు ఎంపికైన విద్యార్థులను మండల విద్యాధికారి టీ విమల, కాంప్లెక్స్ ప్రాధానోపాధ్యాయురాలు గాయత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఉన్నత పాఠశాలల గణిత, సైన్సు ఉపాధ్యాయులు హరి ప్రసాద్, శ్రీనివాస్, రాజయ్య, ప్రతాప్ రెడ్డి, వెంకటపతి, సురేందర్ పాల్గొని పరీక్ష నిర్వహించి జిల్లా టాలెంట్ టెస్ట్ కు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.