తిమ్మాపూర్,జూలై18: కళాశాలలో దింపుతానని వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి.. బైక్పై ఎక్కించుకొని ఎల్ఎండీ పరిసర ప్రాంతాలకు తీసుకెళ్తుండగా అనుమానం వచ్చినయావతి బైక్పై నుండి దూకడంతో స్వల్ప గాయాల పాలయ్యింది. యువతి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ (Karimnagar) రూరల్ మండలం చింతకుంట సమీపంలోని ఒడ్డేపల్లికి చెందిన ఓ మైనర్ బాలిక (16) కరీంనగర్లోని ప్రైవేట్ ఒకేషనల్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నది.
అదే గ్రామానికి చెందిన వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి కాలేజీలో దింపుతానని అమ్మాయిని బైక్పై ఎక్కించుకొ వెళ్లాడు. అయితే కాలేజీ మార్గంలో కాకుండా హైదరాబాద్ రోడ్డు గుండా ఎల్ఎండీ రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లోకి తీసుకెళ్తుండగా ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో అప్రమత్తమైన అమ్మాయి.. కాకతీయ కెనాల్ పరిసర ప్రాంతాల్లో బైక్పైనుంచి దూకేసింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలవడంతోపాటు దుస్తులు చిరిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. నిందితునికోసం గాలిస్తున్నట్లు ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.