koya sri Harsha | పెద్దపల్లి, నవంబర్7: కలెక్టరేట్లో సామూహిక వందేమాతర గీతాలపన కార్యక్రమాన్నిశుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ దాసరి వేణు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది వందేమాతరం గీతాపాలన చేశారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులకు స్పూర్తి నింపిన వందేమాతరం గేయానికి నవంబర్ 7 నాటికి 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా భారత ప్రభుత్వం వందేమాతరం స్మారక నాణేన్ని విడుదల చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో డీ శ్రీనివాస్, సీ సెక్షన్ పర్యవేక్షకులు బండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.