గంగాధర, నవంబర్ 25: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గంగాధర వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గరిగంటి కరుణాకర్ చికిత్స పొందుతూ దవాఖానలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామానికి చెందిన గరిగంటి కరుణాకర్ గంగాధర వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియామకమైన సందర్భంగా ఈనెల 23వ తేదీన కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లాడు.
కొండగట్టు సమీపంలో ఎమ్మెల్యే కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఇదే కాన్వాయ్‌లో ఉన్న కరుణాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కరుణాకర్ ను కరీంనగర్ హాస్పిటల్‌కు తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. కాగా దవాఖానలో చికిత్స కరుణాకర్ మంగళవారం ఉదయం మృతి చెందారు. కరుణాకర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.