ధర్మారం, డిసెంబర్ 8: ధర్మారం మండ లం నర్సింగాపూర్ శివారులోని రత్నాల గుట్టపై 25 లక్షలతో అభయ శ్రీకృష్ణ (నర నారాయణ) ఆలయాన్ని నిర్మించారు. ఆదిలాబాద్ జిల్లా రోటిగూడెంకు చెందిన గీతా ధర్మ ప్రచారక్ శ్రీహరి మౌనస్వామి ఆధ్వర్యంలో ఆలయంలో గురువారం అభయ శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
సామూహిక హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, స్నేహలత దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అభయ శ్రీకృష్ణ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.