International Award | రామగిరి, ఏప్రిల్ 7 : ప్రముఖ అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్, పెద్దపల్లి జిల్లా మంథని జేఎన్టీయూ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక వేదికగా ఎనిఎల్ప్ గ్రూప్స్ బెంగళూరు నిర్వహించే అంతర్జాతీయ అవార్డ్స్, గ్లోబల్ ఐకాన్ అవార్డ్స్కి కృష్ణని ఎంపిక చేశారు. మే8న శ్రీలంకలో శ్రీలంక ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ అవార్డ్స్ ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా శ్రీలంకలో త్రీడీ ఆర్ట్ ని పరిచయం చేసే దిశగా చర్చలు కూడా జరుగుతున్నాయని కృష్ణ తెలిపారు.
తెలంగాణ గౌరవాన్ని, దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో చాటుతున్న కృష్ణను ప్రభుత్వ సలహాదారు కే కేశవ రావు తన నివాసంలో ప్రశంసించారు. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డాక్టర్ నరేంద్ర కుమార్ తన ఆఫీసులో కృష్ణను ఘనంగా సన్మానించి, కృష్ణ చేసే పని అద్భుతమని, ఇలాంటి త్రీడి చిత్రాలను తను ఎప్పుడూ చూడలేదని ప్రశంసించారు. ఈ సందర్భంగా కృష్ణ యూనివర్సిటీ పెద్దలకు, తోటి ఉద్యోగులకు కృతఙ్ఞతలు తెలిపారు.