చిగురుమామిడి, సెప్టెంబర్ 9 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల స్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడలు మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలో ప్రతిభ కనబరిచి జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎదగాలన్నారు. మండల స్థాయిలో నిర్వహించే క్రీడలే క్రీడాకారులకు పునాది లాంటిదన్నారు. చదువుకు అవసరమైన జ్ఞానం ఆలోచన శక్తి క్రీడలు పెంపొందిస్తాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు.
వివిధ పాఠశాలల నుండి 200 మంది విద్యార్థులు క్రీడాకారులు హాజరయ్యారు. అండర్ 14, అండర్ 17 బాలికల విభాగంలో కోకో, కబడ్డీ, వాలీబాల్ క్రీడాంశాలలో ఎంపిక పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై జగదీశ్వర్, ఎంఈఓ జయప్రద, సర్పంచ్ చింతపూల నరేందర్, ఉప సర్పంచ్ అనిల్ కుమార్ వార్డు సభ్యులు లక్ష్మీ, పూజ, కిరణ్, అనిల్ బాబు, ఉమర్ ఉపాధ్యాయులు ఇర్షాద్ మహమ్మద్ విజయలక్ష్మి లక్ష్మణరావు ఎస్ జి ఎఫ్ కార్యదర్శి కనకం సమ్మయ్య కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అందే సురేష్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.