Ranabaali Teaser | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’కి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. సూపర్ హిట్ చిత్రం ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మాస్ యాక్షన్ టీజర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
19వ శతాబ్దం (1854 – 1878 మధ్య) బ్రిటిష్ పాలనా కాలం నాటి చారిత్రక నేపథ్యం, రాయలసీమ ప్రాంత ఆధిపత్య పోరాటాలు మరియు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చారిత్రాత్మక కాన్వాస్ పై ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ శింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో కనిపించనుండగా, రష్మిక ఆయన భార్య జయమ్మ పాత్రలో అత్యంత సంప్రదాయబద్ధంగా, భావోద్వేగాలతో కూడిన పాత్రలో అలరించనున్నారు. అంతేకాకుండా, ఈ చిత్రంలో హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ క్రూరమైన బ్రిటిష్ అధికారి పాత్రలో ప్రధాన విలన్‌గా నటిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
#NeverForget
The Men who came as guests and stayed as oppressors.
The Men in our villages, who decided to draw blood.‘The Savage’s Oath’#RanabaaliTeaser https://t.co/9gwqJ6NuHi pic.twitter.com/7DLgWng1ED
— Vijay Deverakonda (@TheDeverakonda) September 9, 2026
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ – అతుల్ ఈ చిత్రానికి ప్రాణం పోసేలా అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. టీ-సిరీస్ సంస్థ ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని సమర్పిస్తోంది. అన్ని కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదలైన మాస్ యాక్షన్ టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత తారాస్థాయికి చేరాయని, విజయ్ కెరీర్లోనే ఇదొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.