Stock Market | భారీగా నష్టపోయిన స్టాక్‌మార్కెట్.. సెన్సెక్స్ 813 పాయింట్లు పతనం
Stock Market : భారత స్టాక్ మార్కెట్ బుధవారం భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 813 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 203 పాయింట్లు నష్టపోయింది. బుధవారం ఉదయం ట్రేడింగ్ నష్టాల్లోనే మొదలైంది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ బుధవారం భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 813 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 203 పాయింట్లు నష్టపోయింది. బుధవారం ఉదయం ట్రేడింగ్ నష్టాల్లోనే మొదలైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 75,216.22 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. చివరకు 813.35 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 74,764.23 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 203.60 పాయింట్లు నష్టపోయి 23,431.50 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 30 షేర్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, ట్రెంట్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు మారుతి, ఎటర్నల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. బ్రాడర్ మార్కెట్లో నిఫ్టీ 100 షేర్ 0.72 శాతం, నిఫ్టీ ఐటీ ఇంఎక్స్ 3.24 శాతం, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.79 శాతం పడిపోయాయి. ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు అత్యధికంగా 4.55 శాతం పతనమయ్యాయి.
ఇన్ఫోసిస్ షేర్లు 4.43 శాతం, టెక్ మహీంద్రా షేర్లు 3.87 శాతం, టీసీఎస్ షేర్లు 2.26 శాతం పనతమయ్యాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 99.60 డాలర్లకు చేరింది. అమెరికా-ఇరాన్ యుద్ధం మళ్లీ తీవ్రతరం కావడం, సౌదీపై హౌతీ ఉగ్రవాదులు దాడి చేయడం వంటి కారణాల వల్ల క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్ లాభాల్లో ముగియగా.. హాంకాంగ్ సెంగ్ ఇండెక్స్ నష్టాల్లో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.11 వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్స్ ధర అంతర్జాతీయ మార్కెట్లో 4,391.07 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

