Mandakrishna Madiga | రుద్రంగి, జూలై 7: రుద్రంగి మండల కేంద్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దయ్యాల నారాయణ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని నాయకులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దయ్యాల నారాయణ మాట్లాడుతూ మాదిగ జాతి అభివృద్ధికి, మాదిగల హక్కుల కోసం ఏబీసీడీ వర్గీకరణకు అలేపెరగని పోరాటం చేసిన మాదిగ జాతి ముద్ద బిడ్డ మందకృష్ణ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, వారు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దయ్యాల కమలాకర్, దర్శనం గంగాధర్, రమేష్, గంగారెడ్డి, గంగారాం, శ్రీనివాస్, తిరుపతి, వెంకటేష్, లక్ష్మీనారాయణ, అశోక్, మహేందర్, నర్సయ్యతో
పాటు తదితరులు పాల్గొన్నారు.