Manakondur | చిగురుమామిడి, ఆగస్టు 28: గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండలంలోని రేకొండ గ్రామంలో జై గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో మానకొండూరు సీఐ సంజీవ్ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఐని యూత్ క్లబ్ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
అనంతరం సీఐ సంజీవ్ మాట్లాడుతూ గణేష్ మండపాలకు మద్యం తాగి రావొద్దని, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మైక్ సౌండ్ ను వినియోగించుకోవాలని సూచించారు. మండపాలను శుభ్రంగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్త తీసుకోవాలన్నారు. సీఐని సన్మానించిన వారిలో యూత్ క్లబ్ సభ్యులు గొపగొని శ్రీనివాస్, పడాల ఆదిత్య, అఖిల్, శివ, రమేష్, అజయ్, కిరణ్, సాయి తదితరులు ఉన్నారు.