Vemulawada | వేములవాడ, జూలై 6 : వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని తిప్పాపూర్కు చెందిన ఎల రాజయ్య (63) అనే రైతు పాముకాటుతో సోమవారం మృతి చెందారు. ఉదయం పంట చేను వద్దకు వెళ్లగా అక్కడ పాము కుట్టినట్లు గుర్తించి ఇంటికి వచ్చారు.
వెంటనే హుటా కొట్టిన వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చేరుకున్న మరుక్షణమే కుప్పకూలిపోయాడు. దీంతో వైద్యులు పాముకాటుతో మృతి చెందినట్లుగా తెలిపినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య పోచవ్వ, ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉండగా ఒకరు ఏడవ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్, దేవరాజు ఉన్నారు.