మల్లాపూర్ : పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రం శివారులో పెద్దులు అనే ట్రాక్టర్ డ్రైవర్ వ్యవసాయ పొలంలో దున్నుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది.
ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి బావిలోని నీటిలో మునిగి మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.