
Godavarikhani | కోల్ సిటీ, జూలై 12 : గోదావరిఖని ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో శనిగరపు మల్లేష్ ప్యానల్ విజయం సాధించింది. స్థానిక ఫొటో భవన్ లో ఆదివారం సాయంత్రం జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా బైరం సతీష్, ఎలగందుల శ్రీనివాస్, ఎండీ మహబూబ్, కొడిపెల్లి వాసు, నరసింహచారి వ్యవహరించగా మూడు ప్యానళ్లు నామినేషన్ వేశారు. మిట్టపల్లి సమ్మయ్య ప్యానల్ కు కేవలం 18 ఓట్లు రాగా, సుబ్రహ్మణ్యం ప్యానల్ కు 58 ఓట్లు, శనిగరపు మల్లేశ్ ప్యానల్ కు అత్యధికంగా 106 ఓట్లు పోలయ్యాయి. 51 ఓట్ల మెజార్టీతో మల్లేష్ ప్యానల్ విజయం సాధించింది.
ఈ ఎన్నికల్లో జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు పోగుల విజయ్, ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్, కోశాధికారి అల్లం సతీశ్, ఉదయ్ కుమార్లు పరిశీలకులుగా వ్యవహరించారు. కాగా, తమ గెలుపుకు సహకరించిన ఫొటో, అండ్ వీడియో గ్రాఫర్స్ సభ్యులకు నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎన్నికల విజయం సాధించిన మల్లేష్ ప్యానెల్ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంతంలోని ఫోటో, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.