Mala Mahanadu leaders | తిమ్మాపూర్, సెప్టెంబర్ 8 : ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరుగుతున్నదని మాల మహానాడు ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడి చేపట్టనున్న సమాచారంతో మాల మహానాడు నాయకులను ఎల్ఎండీ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. సోమవారం తెల్లవారుజామునే నాయకుల ఇండ్లకు వెళ్లిస్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య మాట్లాడుతూ జీవో నం.99 సవరించి రోస్టర్ పాయింట్ 22 నుండి 16 తగ్గించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకు తీవ్ర అన్యాయం చేసిందని, రోస్టర్ విధానాన్ని సవరించకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
అరెస్ట్ అయిన వారిలో నియోజకవర్గ ఇన్చార్జి లింగం కుమార్, నాయకులు ఎలుక రాజు, గూడ కమలాకర్, కర్ర మణికంఠ, దొంత కనకయ్య, తదితరులున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.