Summer Sports Training Camp | ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. ఆర్జీ-3 అధికార ప్రతినిధి సుదర్శనం
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా అధికార ప్రతినిధి బీ సుదర్శనం సూచించారు.
Summer Sports Training Camp | రామగిరి, ఏప్రిల్ 28 : వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా అధికార ప్రతినిధి బీ సుదర్శనం సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ప్రతీ సంవత్సరం నిర్వహించే వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆర్జీ-3 & ఏపీఏ ఏరియా ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి గాను ఈ నెల 29వ తేదీ నుండి 25 రోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు.
సెంటినరీకానీలోని రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో వాలీబాల్, ఫుట్బాల్, ఆర్చరీ (విలువిద్య), హాకీ వంటి క్రీడల్లో ఉచితంగా శిక్షణ అందించనున్నారు. ఈ శిబిరానికి రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. 18 సంవత్సరాల లోపు సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఈ శిక్షణలో పాల్గొనవచ్చని, ఆసక్తి గల వారు క్రీడల సమన్వయకర్త అంజయ్యను 9581318029 నంబర్కు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

