చొప్పదండి, నవంబర్11: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కోరుట్ల నుంచి జగిత్యాల వరకు నేడు చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. ఈ యాత్రలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొంటారని, చొప్పదండి నియోజకవర్గం నుం చి రైతులు, బీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన చొప్పదండిలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చి న హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రుణమాఫీ పూర్తిగా చేయలేదని, రైతుభరోసా వేయలేదని, వడ్లకు 500బోనస్ ఇస్తామని మోసం చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవంతంగా అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలను ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి వెనకు తీసుకొంటున్నారని మండిపడ్డారు. అంతకుముందు పలు గ్రామాల్లో మృతి చెందిన బీఆర్ఎస్ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ మినుపాల తిరుపతిరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మాచర్ల వినయ్‌కుమార్, బందారపు అజయ్‌కుమార్ పాల్గొన్నారు.