Lok Adalat | ఫర్టిలైజర్ సిటీ, జూలై 13 : చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ఈనెల 18న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ ను ఇరువర్గాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. ఈ మేరకు అదనపు జిల్లా న్యాయస్థానం లో న్యాయవాదుల తో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. గోదావరిఖని లో 709 చెక్ బౌన్స్ కేసు లు పెండింగ్ లో ఉండగా , 117 కేసులలో నాన్ బెయిలబుల్ వారంట్ లు పెండింగ్ లో ఉన్నాయన్నారు.
ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకొని ప్రశాంతం గా ఉండాలని, న్యాయవాదులు సైతం లోక్ అదాలత్ విజయవంతం చేయాలని కోరారు. ఇక్కడ అదనపు జిల్లా న్యాయమూర్తి కోట్ల లావణ్య బాల్ రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి జీవన్ సూరజ్ సింగ్, మున్సిఫ్ మేజిస్ట్రేట్ లు నల్లాల వెంకట సచిన్ రెడ్డి , స్వారీక, బార్ అసోసియేషన్ ప్రతినిధులు బల్మూరి అమరేందర్ రావు, గుజ్జేటి సత్యనారాయణ, కుడిది వెంకటేష్, ముచ్చకుర్తి కుమార్,ప్రసన్న , అసంపల్లి రవీందర్, అంజలి, తిలక్, బార్ కౌన్సిల్ సభ్యురాలు చందాల శైలజ తో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.