Chigurumadi | చిగురుమామిడి, జనవరి 15: మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే స్నానాలు చేసి మహిళలు ఇండ్ల ముందు బియ్యం పిండితో చేసిన రంగురంగుల రంగవల్లులతో అలంకరించారు. ఇండ్ల ముందు గొబ్బెమ్మలు, నవధాన్యాలతో పాటు పూలు పెట్టారు. బంతిపూలతో ఇళ్లను అందంగా అలంకరించారు. ఇండ్లలో పిండి వంటలు చేశారు. కొత్త బట్టలు ధరించి ఆలయాలకి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
తెల్లవారుజామునే హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటల విన్యాసాలు గ్రామాల్లో అలరించాయి. చిన్నారులు రంగురంగుల గాలిపటాలతో కేరింతలు కొట్టారు. ఇండ్ల ముందు మహిళలు పోటీపడి ముగ్గులు వేశారు. పలు గ్రామాల్లో సర్పంచులు ఆకవరం భవాని, సన్నిల్ల కవిత, జంగ శిరీష, గూళ్ల రజిత, ఒంటెల కిషన్ రెడ్డి, మార్క రాజ్ కుమార్, అల్లెపు సంపత్, పీచు సత్యనారాయణరెడ్డి, బోయిని రమేష్ తదితరులు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.