JAGITYAL | జగిత్యాల, ఏప్రిల్ 3 : జగిత్యాల జిల్లా లోని బీర్ పూర్ మండల కేంద్రం శివారులోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఎండోమెంట్ నిధులతో పాటు దాతల సహకారంతో సుమారు రూ.కోటి వ్యయంతో ఆలయ ఆధునీకరణ పనులు చేపడుతున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో ఎండోమెంట్ నుండి ఆలయ అభివృద్ధికి రూ.32 లక్షలు మంజూరు చేయించారు. వాటితో పాటు భక్తుల, దాతల సహకారంతో సుమారు రూ.కోటి వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులు చేసేందుకు గ్రామస్తులు ముందుకు వచ్చారు. ఆలయంలో ప్రస్తుతం పాత ఆలయ అనుకుని ముందు భాగంలో విస్తీర్ణం పెంచి 23 ఫిల్లర్లతో మండపం నిర్మాణం పూర్తి చేశారు.
ఆలయం పైన మూడు గోపుర నిర్మాణాలు, శిఖర పనులు కొనసాగుతున్నాయి. మరో ఆరు నెలల్లో ఆలయ ఆధునీకరణ పనులు పూర్తి కానున్నాయని, ఆలయ అభివృద్ధికి గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు, దాతలు సహకరిస్తు ఆలయాన్ని అభివృద్ధి చేస్తుండడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.