Mahammaidevi Brahmotsavams | సుల్తానాబాద్ రూరల్,ఏప్రిల్ 11: అంగరంగ వైభవంగా మహమ్మాయిదేవి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని దేవాలయ బ్రహ్మోత్సవ నిర్వాహకులు దేవరకొండ కృష్ణమాచార్యులు తెలిపారు. ఆలయం వద్ద ఆయన శుక్రవారం మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామపంచాయతీ పరిధిలోని మహమ్మాయి దేవాలయంలో బ్రహ్మోత్సవాలను ప్రతీ ఏటా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఈనెల 8 నుంచి ప్రారంభమై12 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మంటపరాధనలు, సహస్త్ర నామ పూజలు, కుంకుమార్చనలు, మహా మంత్ర పుష్పములు, దంపతులచే హోమ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
డోలోత్సవం తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించినట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై క్యూలైన్ ద్వారా మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.